పాకిస్తాన్‌లో హిందూ సమాజం దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంది. దీపావళి వేడుకల సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇంట్లో ప్రత్యేక విందును ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమంలో హిందూ, క్రైస్తవ సభ్యులతో పాటు ఇతర మతాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ప్రధాన మంత్రి దీపావళి కేక్ కట్ చేసి, ప్రార్థనలు చేసి, హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు.


