టాలీవుడ్ దర్శకుడు మారుతి-గ్లోబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ రాజాసాబ్. హార్రర్ కామెడీ జోనర్లో పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజాసాబ్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. కారు రూఫ్‌టాప్‌పై స్టైలిష్‌గా కూర్చున్న రాజాసాబ్‌కు గ్రాండ్ వెల్ కమ్ చెబుతున్న స్టిల్ ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇప్పటికే రాజాసాబ్ ట్రైలర్‌ను లాంచ్ చేయగా, కామెడీ, లవ్, రొమాన్స్, హార్రర్ లాంటి ఎలిమెంట్స్‌తో మారుతి మార్క్ కామెడీ టచ్‌తో సినిమా ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నారు.


