భారత్-అస్ట్రేలియా దేశాల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెలరేగి ఆడటంతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 237 పరగుల లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన ఆస్ట్రేలియా కేవలం 38.3 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.


