రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మనం చిన్న బ్రేక్ తీసుకుందామా, అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఎమోషనల్‌గా సాగింది. ఇందులో రష్మిక బాయ్ ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి నటించబోతున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


