రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ కథానాయిక. ప్రస్తుతం శ్రీలంకలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీ అచ్చియమ్మా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో జాన్వీ క్రికెట్ కామెంటేటర్‌గా కనిపించనుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 27న విడుదల కానుంది.


