పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేయగా, అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయని పరిస్థితి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు స్పందించని విషయం తెలిసిందే. దీంతో వారిరువురికి స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేల విచారణ నేటితో ముగియనుంది. కేసు విచారణ ఆలస్యంపై సుప్రీం సీరియస్ అవడంతో పాటు నాలుగు వారాలు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో వేగం పెంచాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు.


