ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామిక భూములను లాక్కుని పెద్ద కుంభకోణానికి తెరలేపుతున్నార ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఇండస్ట్రీ భూములను బడా బాబులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దాదాపు పదివేల ఎకరాల పారిశ్రామిక భూములను లాక్కుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కాంకు పాల్పడుతున్నారంటూ ఎంపీ ఫైర్ అయ్యారు. నాడు కేసీఆర్ కూడా ఇందిరా పార్క్, ఎన్టీఆర్ స్టేడియం భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నామని గుర్తుచేశారు. పారిశ్రామిక భూములను ప్రజా ప్రయోజనాల కోసమే కేటాయించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక భూములను లాక్కునే పాలసీని క్యాబినెట్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఒక బీజేపీ ఎంపీకి అధిష్టానం నోటీసు ఇచ్చిన అంశం తన దృష్టికి రాలేదని చెప్పుకొచ్చారు.


