జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ కార్యాలయంలో నవీన్ యాదవ్‌తో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు. నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, ఎమ్మెల్యే గణేష్, కాంగ్రెస్ నేతలు, నవీన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 20 వేలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు.


