టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడమోరు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న వీరిరువురు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరు లోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇషా పౌండేషన్ యోగా సెంటర్ లో సమంత, రాజ్ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.


