My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్​‌రెడ్డి  ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ -2047​ గ్లోబల్​ సమ్మిట్‌కు రావాలంటూ ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్​ సమ్మిట్​ ఆహ్వాన పత్రికను ప్రధానికి అందజేశారు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్​ భారత్ -2047 లక్ష్యాలకు అనుగుణంగా,  3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా […]

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్​‌రెడ్డి  ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ -2047​ గ్లోబల్​ సమ్మిట్‌కు రావాలంటూ ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్​ సమ్మిట్​ ఆహ్వాన పత్రికను ప్రధానికి అందజేశారు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్​ భారత్ -2047 లక్ష్యాలకు అనుగుణంగా,  3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతోందని ప్రధానికి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్​ -2047 విజన్​ డాక్యుమెంట్​ రూపొందించినట్లు  రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. నీతి అయోగ్​ సలహాలు, సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్​ డాక్యుమెంట్‌ను గ్లోబల్​ సమ్మిట్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ప్రధాని మోదీకి తెలిపారు.  ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.