My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

దేవుని దయ లేకుండా ఇది సాధ్యం కాదు : బాలకృష్ణ

బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కొలాబరేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.  ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ చెన్నైలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ నేను ఇక్కడ పుట్టడం వల్ల చెన్నై నా ఇల్లులా అనిపిస్తుంది. మద్రాస్‌ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి. ఈ చిత్రాన్ని వివిధ దేశాలలో […]

బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కొలాబరేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.  ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ చెన్నైలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ నేను ఇక్కడ పుట్టడం వల్ల చెన్నై నా ఇల్లులా అనిపిస్తుంది. మద్రాస్‌ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి. ఈ చిత్రాన్ని వివిధ దేశాలలో 130 రోజుల్లోనే అద్భుతంగా చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇది సాధ్యం కాదు. ధర్మం కోసం జీవించాలి సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచ కూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు.

భవిష్యత్‌ తరాలు ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు. ఇది ప్రేక్షకులకు శాంతిని తెస్తుంది. బోయపాటి, మాది హిట్‌ కాంబినేషన్‌. సింహ, లెజెండ్‌, అఖండ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సినిమా కూడా ఘన విజయాన్ని సాధిస్తుంది అని తెలిపారు. అఖండ రీజినల్‌ సినిమా కాదు ఇండియన్‌ సినిమా. అలాగే అఖండ 2 ఇది భారత దేశ ఆత్మ. మీరందరూ చూసి ఎంకరేజ్‌ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఆడియన్స్‌ని కమర్షియల్‌గా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ పరమశివుడే మీ ముందుకు వచ్చి ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ సందేశం దేశం, ధర్మం, దైవం, వేదం  ఇది కమర్షియల్‌గా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది అని డైరెక్టర్‌ బోయపాటి శ్రీను చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.