ఒక్క ప్రాజెక్టుకైనా అమరుడైన శ్రీకాంతాచారి పేరు పెట్టారా? అని కాంగ్రెస్ నేతలను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిలదీశారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్‌లోని మహనీయుల విగ్రహాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. అమరులను గౌరవిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ పేర్లనే ప్రాజెక్టులకు పెట్టిందన్నారు. నిజంగా త్యాగం చేసినటువంటి తెలంగాణ బిడ్డల పేర్లు నిలిచేలా పాటుపడాలని, అందుకు తెలంగాణ జాగృతి పాటుపడుతోందన్నారు.


