My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

శాంతి బ‌హుమ‌తి గెలుచుకున్న‌ డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్  ఎట్ట‌కేల‌కు శాంతి బ‌హుమ‌తి గెలుచుకున్నారు. అయితే ఓస్లోలోని నోబెల్ క‌మిటీ ఆ అవార్డును ఇవ్వ‌లేదు. కానీ అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ స‌మాఖ్య ఫిఫా ట్రంప్‌కు గౌర‌వ పీస్ ప్రైజ్‌ను అంద‌జేసింది. నోబెల్ శాంతి బ‌హుమ‌తి కోసం ట్రంప్ ట్రై చేసినా ఆయ‌న‌కు ఆ అవార్డు ద‌క్క‌లేదు. కానీ క‌న్సోలేష‌న్ రీతిలో ట్రంప్‌కు ఫిఫా త‌న తొలి పీస్ ప్రైజ్‌ను అంద‌జేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌కొన్న కొన్ని సంక్షోభాల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ట్రంప్ స‌క్సెస్ అయ్యార‌ని, దాని […]

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్  ఎట్ట‌కేల‌కు శాంతి బ‌హుమ‌తి గెలుచుకున్నారు. అయితే ఓస్లోలోని నోబెల్ క‌మిటీ ఆ అవార్డును ఇవ్వ‌లేదు. కానీ అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ స‌మాఖ్య ఫిఫా ట్రంప్‌కు గౌర‌వ పీస్ ప్రైజ్‌ను అంద‌జేసింది. నోబెల్ శాంతి బ‌హుమ‌తి కోసం ట్రంప్ ట్రై చేసినా ఆయ‌న‌కు ఆ అవార్డు ద‌క్క‌లేదు. కానీ క‌న్సోలేష‌న్ రీతిలో ట్రంప్‌కు ఫిఫా త‌న తొలి పీస్ ప్రైజ్‌ను అంద‌జేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌కొన్న కొన్ని సంక్షోభాల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ట్రంప్ స‌క్సెస్ అయ్యార‌ని, దాని కోసమే ఆయ‌న‌కు అవార్డు అంద‌జేస్తున్న‌ట్లు ఫిఫా తెలిపింది. వాషింగ్ట‌న్‌లోని కెన్న‌డీ సెంట‌ర్‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

వ‌చ్చే ఏడాది జరిగే ఫుట్‌బాల్ వ‌రల్డ్‌క‌ప్ టోర్నీని అమెరికాతో పాటు కెన‌డా, మెక్సికో దేశాలు హోస్ట్ చేయ‌నున్నాయి. వ‌ర‌ల్డ్ క‌ప్ డ్రా తీస్తున్న సంద‌ర్భంగా జ‌రిగిన ఈవెంట్‌లో ట్రంప్‌కు స్పెష‌ల్ ప్రైజ్ అంద‌జేసింది. ఆ కార్య‌క్ర‌మంలో కెన‌డా ప్ర‌ధాని మార్క్ కార్నే, మెక్సికో ప్ర‌ధాని క్లాడియా షీన్‌బామ్ పాల్గొన్నారు. ఫిఫా అధ్య‌క్షుడు గియ‌న్ని ఇన్‌ఫాంటినో కూడా కార్య‌క్ర‌మంలో ఉన్నారు. ఫిఫా పీస్ ప్రైజ్‌ను ఇవ్వ‌నున్న‌ట్లు గ‌త నెల‌లోనే ఫిఫా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. అవార్డు కార్య‌క్ర‌మంలో ట్రంప్‌కు ఓ మెడ‌ల్ ఇచ్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా శాంతి, ఐక్య‌త‌ను ప్ర‌మోట్ చేసిన ట్రంప్‌కు శాంతి బ‌హుమ‌తి ఇస్తున్న‌ట్లు ఫిఫా అధ్య‌క్షుడు గియాన్ని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.