My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

ముగిసిన రెండో విడత పోలింగ్

ఈనెల 11న‌ మొద‌టి విడ‌త పంచాయ‌తీ పోలింగ్ ముగిసిన విష‌యం తెలిసిందే. తాజాగా తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం 1 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు […]

ఈనెల 11న‌ మొద‌టి విడ‌త పంచాయ‌తీ పోలింగ్ ముగిసిన విష‌యం తెలిసిందే. తాజాగా తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం 1 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల సంఘం అధికారులు. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్​చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఆ వెంటనే గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకోనున్నారు. సెకండ్ ఫేజ్‎లో భాగంగా 193 మండలాల్లోని 3 వేల 911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అదే విధంగా ఈనెల 17న‌ మూడో విడ‌త‌తో పంచాయ‌తీ పొలింగ్ ముగియ‌నుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.