నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో జరిగిన నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కొత్త సర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ వారి కోసం ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు సత్తా చాటారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడి, ఏదో ఒక కేసులో ఇరికించి మిమ్మల్ని సస్పెండ్ చేయించే కుట్రలు చేస్తారు, మీరు ఎవరికీ భయపడొద్దని సూచించారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి తిరగడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ అన్నారు. విజయోత్సవాల పేరుతో రేవంత్ రెడ్డి జిల్లా జిల్లాకు తిరిగి పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేశాడని తెలిపారు.


