తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించేలా, కొత్త చిత్రాలు విడుదలైన వెంటనే ఐబొమ్మ, బప్పం వంటి 17 వెబ్‌సైట్స్ ద్వారా కోట్లు సంపాదించిన బోడపాటి రవి అలియాస్ ఐబొమ్మ రవికి కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రవి పోలీస్ కస్టడీ లో ఉన్నాడు. ఈ మధ్య ఆయన బేయిల్ కోసం పెట్టుకున్న అర్జీని కోర్టు తిరస్కరించింది. కాగా, ఈ పిటీషన్ పై నాంపల్లి కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రవిని 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఒక్కో కేసులో 3 రోజుల పాటు విచారించాలని తెలిపింది. ఈ లెక్కన ఐబొమ్మ రవిపై నాలుగు కేసులు ఉండగా, మొత్తం 12 రోజుల పాటు విచారించనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 18 నుంచి విచారణ మొదలుకానుంది. ఈ కస్టడీ ద్వారా పోలీసులు ఐబొమ్మ రవికి సంబంధించిన వెబ్‌సైట్ కార్యాకలాపాలను పూర్తిగా ఛేదించి, పైరసీ నెట్‌వర్క్ ని పూర్తిగా క్లోజ్ చేసే పనిలో ఉన్నారు.


