ఈ నెల ప్రారంభంలో తమ వర్క్ పర్మిట్లను పనరుద్ధరించుకోవడానికి భారత్‌కు తిరిగి వచ్చిన వందలాది మంది హెచ్-1బీ వీసాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అమెరికా కాన్సులర్ కార్యాలయాలు ఇప్పటికే ఖరారైన అపాయింట్‌మెంట్లను వాయిదా వేశాయి. డిసెంబర్ 15 -26 మధ్య షెడ్యూల్ చేసిన అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో వర్క్‌పర్మిట్ల పునరుద్ధరణ కోసం భారత్‌కు వచ్చిన వందలాది మంది హెచ్-1బీ వీసాదారులు ఇక్కడే చిక్కుకుపోయారు. ఈ సమయంలో అమెరికాలో సెలవుల కావడం, యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ విధానం కూడా ఈ పరిస్థితి కారణంగా తెలుస్తోంది.


