ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దానం మీడియాతో మాట్లాడుతూ తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నామని, తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని తెలియజేశారు. జిహెచ్ఎంసి లో కాంగ్రెస్, ఎంఐఎం మొత్తం 300 డివిజన్లు గెలుస్తాయని, గ్రేటర్ హైదరాబాద్ అంతటా ప్రచారం చేస్తానని అన్నారు. జిహెచ్ఎంసి అంతటా తిరిగి కాంగ్రెస్ పథకాలను వివరిస్తానని, జిహెచ్ఎంసి విస్తరణతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.


