తెలంగాణ శాసన మండలిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక, జాగృతి త్వరలోనే రాజకీయ పార్టీగా మారుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అని అన్నారు. కెఎ పాల్ కూడా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఆమె ఆత్మ గౌరవం ఎలా దెబ్బతింతో అది వారి కుటుంబ అంశమని, ఆమె పార్టీ పెట్టడం వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని చెప్పారు. విబి జి రామ్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని రామందర్‌రావు వ్యతిరేకించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎవరికీ మంచి జరగలేదని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకంలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. పారదర్శకత లేని స్కీములే కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటుందని పేర్కొన్నారు.


