అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మెక్సికోపై బెదిరింపులకు దిగారు. మెక్సికోపై సైనికచర్యలను చేపట్టనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. డ్రగ్స్ అక్రర రవాణాను అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణాను, ముఖ్యంగా మెక్సికో నుండి వచ్చే ఫెంటానిల్‌ను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆరోపిస్తున్నారు. దక్షిణ సరిహద్దు దాటి అమెరికా సైన్యాన్ని మోహరించనున్నట్లు తెలిపారు.


