బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరగబోయే 23వ ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని ఆహ్వానం లభించింది. హైదరాబాద్, తెలంగాణ పై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంపొందించడంలో కేటీఆర్ కీలక కృషికి గానూ ఈ ఆహ్వానం అందినట్లుగా నిర్వాహకులు తెలిపారు. హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. ది ఇండియా వి ఇమాజిన్ ( మన ఊహల్లోని భారత్) అనే థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు భారత్, దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, వ్యాపారవేత్తలు, పాలసీ మేకర్స్, సాంస్కృతిక రంగ నిపుణులు హాజరుకానున్నారు.


