కాంగ్రెస్, బిఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ నాటి స్కామ్ లే కాంగ్రెస్ హయాంలో జరగుతున్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో యాక్టింగ్ తప్పితే, యాక్షన్ లేదని, రెండేళ్ల నుంచి నోటీసులు ఇస్తున్నారు తప్పితే చర్యలు లేవు అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను కాంగెస్, బిఆర్ఎస్ మోసగిస్తున్నాయని, నోటీసులు ఇస్తున్నారు తప్పితే, అరెస్టులు చేయట్లేదని రామచందర్ రావు ఎద్దేవా చేశారు.


