My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై రాష్ట్ర హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీం న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు పోస్టులు పెట్టారని పోలీసులు మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసుపై గతంలో విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు, సదరు ఎఫ్ఐఆర్‌లను కొట్టివేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ […]

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై రాష్ట్ర హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీం న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు పోస్టులు పెట్టారని పోలీసులు మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసుపై గతంలో విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు, సదరు ఎఫ్ఐఆర్‌లను కొట్టివేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్‌గా కేసులు నమోదు చేయొద్దని పోలీసులకు సూచించింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా గతంలో ప్రస్తావించారు. ఈ కేసును తాజాగా విచారించిన సుప్రీం న్యాయస్థానం, హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేమీలేదని స్పష్టం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.