మక్తల్ లో బిజెపి నేత మహదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మక్తల్ లో బిజెపి నేత ఆత్మహత్యపై బండి సంజయ్ స్పందించారు. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలు చేస్తున్నారని అన్నారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతుందని సూచించారు. తమ సహనాన్ని పిరికితనంగా భావిస్తారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పై యుద్ధం చేస్తామని కార్యకర్తలకు బిజెపి నాయకత్వం అండగా ఉంటుందని సంజయ్ భరోసా ఇచ్చారు.


