దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్రమంత్రిని విన్నవించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో కార్యక్రమం చేపడుతున్నట్లు రక్షణ మంత్రికి వివరించారు.
1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభస్మాన్ని ఈసా, మూసీ సంగమంలో నిమజ్జనం చేశారని కేంద్ర మంత్రికి తెలియజేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు, బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు కేంద్రమంత్రికి తెలియజేశారు.


