My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

తెలంగాణ ఓట్లతో గెలిచిన వారెవరైనా ఆ పని చేస్తారా?:  రేవంత్‌రెడ్డి

నీళ్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తోందన్న బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖండించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో దేవాదుల ప్రాజెక్టును సందర్శించాక రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన వారెవరైనా ఆ పని చేస్తారా అని నిలదీశారు. ఏపీ నుంచి వలసవచ్చి ఇక్కడ సెటిలైన వ్యక్తులైనా సహకరిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలతో ప్రయోజనం ఉండదన్నారు. గోదావరి జలాలపైనే గాక కృష్ణా జలాలపైనా […]

నీళ్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తోందన్న బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖండించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో దేవాదుల ప్రాజెక్టును సందర్శించాక రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన వారెవరైనా ఆ పని చేస్తారా అని నిలదీశారు. ఏపీ నుంచి వలసవచ్చి ఇక్కడ సెటిలైన వ్యక్తులైనా సహకరిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలతో ప్రయోజనం ఉండదన్నారు. గోదావరి జలాలపైనే గాక కృష్ణా జలాలపైనా అనేక అపోహలు కల్పిస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ర్టానికి నీటిని తరలించడానికి తాము సహకరిస్తున్నామని అంటున్నారని తప్పుబట్టారు.

కృష్ణా జలాలపై శాసనసభలోనే పూర్తి స్థాయి చర్చ చేపట్టాం. బహిరంగ సభలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం వద్దు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ హయాంలో హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, రెండేళ్లుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో చర్చించేందుకు అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నాం. కృష్జా జలాలకు సంబంధించిన అంశాలపై మొన్నటి సభలో వివరణ ఇచ్చాం. మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మాపై ఆరోపణలు చేయడం సబబు కాదు. మీరు తప్పు చేశారా లేదా అన్నది ప్రజలు గుర్తించారు, శిక్షించారు. గోదావరి జలాలపై సభలో కూర్చుని చర్చ చేద్దాం. మేం ఏదైనా సవరించుకోవాల్సి ఉంటే అందుకు అభ్యంతరం లేదు అని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తెలంగాణ సమాజానికి ఉపయోగపడే మంచి పుస్తకాలు చదవాలని, చిన జీయర్‌స్వామి సూక్తులు, మంచి ప్రవచనాలు వినాలని సూచించారు. అంతేతప్ప ప్రజలపై విషం కక్కవద్దని, తమ వారసత్వ ఆస్తిని ఎవరో కొల్లగొట్టారన్నట్లుగా కడుపులో బాధ పెట్టుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.