రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. రాజధాని టెల్ అవివ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. ఇరువురు ప్రధానులు రెడ్ కార్పెట్‌పై నడుస్తూ, అధికారులు, సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రెండు దేశాలకు చెందిన అధికారులను పరిచయం చేసుకున్నారు. ఈ పర్యటన సమయంలో మోదీ పాకెట్‌లో కాషాయ రంగు స్క్వేర్ ఉండటం, అలాగే నెతన్యాహు భార్య సారా కూడా కాషాయ రంగు ధరించడంపై నెతన్యాహు ఛలోక్తులు విసిరారు. మోదీని రిసీవ్ చేసుకోవడం కోసం నెతన్యాహు ప్రోటోకాల్ కూడా ఉల్లంఘించడం విశేషం.


