My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

సౌదీ అరేబియా కీలక నిర్ణయం

అరబ్‌ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ వెల్లడించింది. నిషేధించిన దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది.ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య పరిణామాలు, అంటువ్యాధులు వంటి అంశాలను సమీక్షించి ఈ నిషేధం విధించినట్లు సౌదీ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీ వెల్లడించింది. దాదాపు 40 దేశాల నుంచి పౌల్ట్రీ, […]

అరబ్‌ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ వెల్లడించింది. నిషేధించిన దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది.ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య పరిణామాలు, అంటువ్యాధులు వంటి అంశాలను సమీక్షించి ఈ నిషేధం విధించినట్లు సౌదీ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీ వెల్లడించింది. దాదాపు 40 దేశాల నుంచి పౌల్ట్రీ, గుడ్లపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నది. ఈ జాబితాలో భారత్‌తో పాటు అఫ్గానిస్థాన్‌, చైనా, జర్మనీ, ఇండోనేసియా, యూకే, జపాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి దేశాలు ఉన్నాయి. ఇవేగాక మరో 16 దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాలపై పాక్షిక ఆంక్షలు విధించింది. ఆస్ట్రేలియా, అమెరికా, ఇటలీ, భూటాన్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాలపై ఈ పాక్షిక ఆంక్షలు అమలవుతాయని తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.