అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న చిత్రం వృషకర్మ. కార్తీక్ దండు దర్శకత్వం. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోండగా, లాపతా లేడీస్’ ఫేం స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను మార్చి 5న విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ లాంచ్ చేశారు. ఓ గుహలో చైతూ నడుముకు బెల్ట్, చేతిలో ఆయుధాన్ని పట్టుకుని కనిపించడం చూడొచ్చు. గ్లింప్స్‌తో వృషకర్మ ప్రపంచాన్ని చూపించబోతున్నాం. సూపర్ ఎక్జయిట్ చేసే అవుట్‌పుట్ మీ కోసం రెడీ చేసిందంటూ మేకర్స్ షేర్ చేసిన లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ సుకుమార్ బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ బి.లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.


