టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న (విరోష్) వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులకి వారు శుభలేఖలు పంపడం జరిగింది. అయితే విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వానానికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి, నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో దేవరకొండ, మందన్న కుటుంబాలకు అభినందనలు తెలియజేసిన ప్రధాని, ఈ వివాహాన్ని వారి జీవితాల్లో అందమైన కొత్త అధ్యాయానికి ఆరంభంగా పేర్కొన్నారు. జీవితాంతం స్నేహం, తోడ్పాటు, పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం వంటి విలువలపై నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. దాంపత్య జీవితం ప్రేమతో, కలలతో, పరస్పర గౌరవంతో నిండి ఉండాలని ఆశీర్వదించారు. విజయ్, రష్మిక తమ జీవితంలో కొత్, సుందరమైన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు మోదీ. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు కలిసి వేస్తూ జీవితంలో భాగస్వాములుగా మారుతున్నారని పేర్కొన్నారు.


