My Telugu NRI

Mobile Scrollable Menu
- Business - Latest News

హైదరాబాద్‌లో మరో లగ్జరీ హోటల్‌.. రూ.350 కోట్లతో ఏర్పాటు!

హైదరాబాద్‌లో లగ్జరీ హోటల్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్స్‌. రూ.350 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న ఈ హోటల్‌ కోసం చాలెట్‌ హోటల్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా మైండ్‌స్పేస్‌ మాదాపూర్‌ క్యాంపస్‌లో 5.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన హోటల్‌ను నెలకొల్పుతున్నది. ఈ హోటల్‌ 2027-28 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి పూర్తికాగలదని ఆశిస్తున్నట్టు కే రహేజా కార్ప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ ప్రైవేట్‌ […]

హైదరాబాద్‌లో లగ్జరీ హోటల్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్స్‌. రూ.350 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న ఈ హోటల్‌ కోసం చాలెట్‌ హోటల్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా మైండ్‌స్పేస్‌ మాదాపూర్‌ క్యాంపస్‌లో 5.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన హోటల్‌ను నెలకొల్పుతున్నది.

ఈ హోటల్‌ 2027-28 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి పూర్తికాగలదని ఆశిస్తున్నట్టు కే రహేజా కార్ప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో, ఎండీ రమేశ్‌ నాయర్‌ తెలిపారు. 1.3 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను నెలకొల్పింది రహేజా మైండ్‌స్పేస్‌. దీంతో ప్రధానంగా ఐటీ/ఐటీఈఎస్‌ సంస్థలు తమ కార్యాలయాలను నెలకొల్పాయి . అలాగే వెస్టిన్‌ బ్రాండెడ్‌ హోటల్స్‌, ఇనార్బిట్‌ మాల్‌ కూడా ఉన్నది. రీట్స్‌నకు హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, చెన్నైలో కార్యాలయాలు ఉన్నాయి. మొత్తంగా 3.9 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్‌ స్థలాన్ని లీజుకు ఇచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.