మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. జాన్వీ కపూర్ కథానాయిక. సెకండ్ సింగిల్ రై రై రారా విడుదలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 2న ఈ మాస్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సుమారు 1000 మంది డ్యాన్సర్లతో అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ ఇంట్రడక్షన్ సాంగ్‌లో నీ అయ్య వడ్డీ… నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే అంటూ సాగే పవర్‌ఫుల్ లిరిక్స్ రామ్ చరణ్ క్యారెక్టర్‌లోని ఊర మాస్ స్వభావాన్ని ఎలివేట్ చేయనున్నట్లు తెలుస్తుంది.
ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ది సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


