My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

హుషారు పిట్టల మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

అన్షు మరియు వాసవి గణేషన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ హుషారు పిట్టలు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిల్మ్స్ విడుదల చేస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు భారీ స్పందన రాగా, తాజాగా ఈ చిత్రం […]

అన్షు మరియు వాసవి గణేషన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ హుషారు పిట్టలు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిల్మ్స్ విడుదల చేస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు భారీ స్పందన రాగా, తాజాగా ఈ చిత్రం నుంచి మంగళస్నానం అనే హార్ట్ టచింగ్ ఎమోషనల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ఒక తండ్రి తన కూతురిని ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటారో, ఆమెపై ఎంతటి ప్రాణాన్ని పెట్టుకుంటారో అద్భుతంగా ఆవిష్కరించింది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే విడదీయలేని అనుబంధానికి ఈ గీతం అద్దం పడుతోంది. ఎస్.ఎస్. చిరంజన్ హృద్యమైన సాహిత్యం అందించగా, యోగి సురేష్ మరియు విహా తమ గాత్రంతో ప్రాణం పోశారు. చరణ్ అర్జున్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అన్షు, వాసవి గణేషన్‌లతో పాటు గోవర్థన్, సునీత్ మనోహర్, రమేష్, బలగం బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.