My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

రణబాలి నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్

టాలీవుడ్ కొత్త జంట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందనల‌కి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌ని ఇచ్చారు ర‌ణ‌బాలి మేక‌ర్స్. వీరిద్దరూ జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రణబాలి. ఈ సినిమాలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మగా నటిస్తున్నారు. ఇటీవ‌ల వివాహాబంధంలోకి అడుగుపెట్టిన వీరికి చిత్ర‌బృందం స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌ని ఇస్తూ, చిత్రంలోని రొమాంటిక్ మెలోడీ ఎందయ్య సామి పాటను విడుదల చేశారు.  ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన ఈ పాట వినగానే ఆకట్టుకునేలా […]

టాలీవుడ్ కొత్త జంట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందనల‌కి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌ని ఇచ్చారు ర‌ణ‌బాలి మేక‌ర్స్. వీరిద్దరూ జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రణబాలి. ఈ సినిమాలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మగా నటిస్తున్నారు. ఇటీవ‌ల వివాహాబంధంలోకి అడుగుపెట్టిన వీరికి చిత్ర‌బృందం స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌ని ఇస్తూ, చిత్రంలోని రొమాంటిక్ మెలోడీ ఎందయ్య సామి పాటను విడుదల చేశారు.  ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన ఈ పాట వినగానే ఆకట్టుకునేలా ఉంది. తెలుగులో ఎందయ్య సామి, తమిళంలో ఎదయ్యా సామి, హిందీలో ఓ మేరే సాజన్ అంటూ ఐదు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.  హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (మమ్మీ ఫేమ్) కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.