క్రికెట్ ప్రపంచం గర్వించదగ్గ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబయిలోని ప్రఖ్యాత సెయింట్ రెజిస్ హోటల్ ఈ అద్భుత వేడుకకు వేదికైంది. ఈ శుభకార్యం సందర్భంగా టెండూల్కర్ నివాసం మరియు వివాహ వేదిక వద్ద కోలాహలం నెలకొంది. ఈ వివాహానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ దంపతులు అభిషేక్ బచ్చన్ దంపతులు, క్రికెటర్ ధోని దంపతులు, ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన అర్ధాంగి బ్రహ్మణితో కలిసి హాజరయ్యారు.


