నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న పీరియాడిక్ డ్రామా షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. నయనతార కథానాయిక. సతీష్ కిలారు నిర్మాణంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్లో 111వ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ సినిమా ప్రారంభానికి సంబంధించి సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ షూటింగ్ లొకేషన్ నుండి ఒక ఆసక్తికరమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. చారిత్రక నేపథ్యంతో సాగే ఈ కథలో బాలకృష్ణ ఒక శక్తివంతమైన మహారాజు పాత్రలో కనిపించబోతున్నారని, ఈ పాత్ర గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుందని సమాచారం.ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.


