ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన అయతొల్లా మొజ్తాబా ఖమేనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. ఇరాన్‌కు మద్దతుగా ఉంటామని పుతిన్ హామీ ఇచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మొజ్తాబాకు శుభాకాంక్షలు. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్‌కు రష్యా అండగా నిలబడుతుంది. ఇరాన్‌లోని మా స్నేహితులకు, వారి సమగ్రతకు రష్యా మద్దతుగా ఉంటుంది. మొజ్తాబా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఇరాన్ ప్రజల్ని ఏకతాటిపైకి తెస్తారని భావిస్తున్నాం. యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో నాయకత్వం వహించడానికి మొజ్తాబాకు గొప్ప ధైర్యం, పట్టుదల కావాలి అని పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఒకవైపు మొజ్తాబా ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, రష్యా మాత్రం మద్దతుగా నిలవడం విశేషం. ఈ యుద్ధ సమయంలో ఇరాన్‌కు రష్యా నైతిక మద్దతు ప్రకటించింది.


