50 ఏళ్లలోపు మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంపై కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని ఆలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కేరళం సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్లో దీనిపై ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. భక్తుల మనోభావాలు, ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాల్ని దృష్టిలో ఉంచుకుని, వాటిని కాపాడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, త్వరలోనే కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాజకీయ కోణంలోనే ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


