ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఎక్కడున్నారన్న సమాచారం చెప్పే వారికి 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.93కోట్లు )ఇస్తామని అమెరికా భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ విదేశాంగశాఖ ప్రకటన చేసింది. సుప్రీం నేత ఖమేనీతోపాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజాని సహా పలువురి పేర్లను యూఎస్ విదేశాంగశాఖ ప్రస్తావించింది. వీరు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని ఆరోపించింది. వీరికి సంబంధించిన సమాచారం ఉంటే ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ లేదా టోర్ నెట్‌వర్క్ ద్వారా తెలియజేయాలని పేర్కొంది. ఇందుకు తగిన బహుమతి ఇస్తామని, సమాచారం అందించినవారికి పునరావాసం కల్పిస్తామని వెల్లడించింది. అమెరికా,ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన తరువాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఎన్నికయ్యారు. అయితే మొజ్తాబా ఇప్పటివరకు ఎక్కడున్నారనే విషయంపై స్పష్టత లేదు.


