ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో లారిజాని మరణించాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. ఈ దాడిలో లారిజానితోపాటు ఇరాన్ టాప్ కమాండర్ గోలాంరెజా సోలేమని కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే, ఈ విషయంపై ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అంతమైన తర్వాత కూడా అమెరికా, ఇజ్రాయెల్ దళాలపై ఇరాన్ గట్టిగా పోరాడుతోంది. ఈ పోరాటం వెనుక ఉన్నది మాత్రం ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని అని ఇజ్రాయెల్ విశ్వాసం. ఆయన ఆధ్వర్యంలోనే ఇరాన్ పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. ఇటీవల లారిజన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్‌ను అంతం చేస్తానన్నాడు. అయితే, ఆయనెవరో కూడా తనకు తెలియదని ట్రంప్ అన్నాడు. మరోవైపు ముస్లిం దేశాలు తమకు మద్దతుగా నిలవకపోవడంపై లారిజన్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇరాన్ సైన్యాన్ని దాడుల్ని లారిజాని పర్యవేక్షిస్తు్న్నట్లు తెలుస్తోంది.


