గత కొన్ని రోజులుగా పశ్చియాసియాలో భీకర యుద్ధం జరుగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా యుద్ధ వాతావరణం చల్లబడటం లేదు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఖమేనీ ఎక్కడున్నారనే విషయంపై తమ వద్ద సమాచారం లేదని ఐడిఎఫ్ ప్రతినిధి ఎఫీ డెప్రిన్ అన్నారు.
ఆయన(ఖమేనీ) ఎక్కడున్నారనే దానిపై మా వద్ద సమాచారం లేదు. కానీ, మా దేశానికి ముప్పుగా పరిణమించిన వారిని వెంబడించడం మాత్రం ఆపం. మాకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు మా నుంచి తప్పుకోలేరు. వారిని తరమి, తరమి.. అంతం చేస్తాం. ఎప్పుడు, ఎక్కడ అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేకపోయినా..మా టార్గెట్ మాత్రం మిస్ కాదు అని డెప్రిన్ అన్నారు.


