టాలీవుడ్ లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబు శికంజా మాలిక్ అనే పవర్‌ఫుల్ మరియు డార్క్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ వీడియోను పంచుకుంది. ఈతరం వారికి అసలు మోహన్ బాబు అంటే తెలియదు. ప్యారడైజ్ సినిమాతో మోహన్ బాబు అంటే ఎంటో చూపిస్తాం అంటూ దర్శకుడు శ్రీకాంత్ ఈ వీడియోలో చెప్పుకోచ్చాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎస్ఎల్ వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల కానుంది.


