జపాన్ ప్రధాని సనేయి తకాయిచికి షాకిచ్చారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఓవల్ ఆఫీసులో ట్రంప్‌ను జపాన్ ప్రధాని కలిశారు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే మిత్ర దేశాలతో సంప్రదింపులు చేయకుండా ఇరాన్‌పై ఎందుకు దాడి చేశారని ఓ రిపోర్టర్ అడిగారు. దానికి ట్రంప్ స్పందిస్తూ తనదైన స్టయిల్‌లో జోకేశారు. తాము ఆ దాడి గురించి ఎవరికీ చెప్పలేదని, ఎందుకంటే మేం సర్‌ప్రైజ్ చేయాలనుకున్నామని, సర్‌ప్రైజ్ గురించి జపాన్ కన్నా బాగా తెలిసిన దేశం ఏదైనా ఉంటుందా, ఓకేనా, మీరెందుకు పెరల్ హార్బర్ దాడి గురించి నాకు చెప్పలేదని ట్రంప్ అన్నారు. దీంతో పక్కనే కూర్చున్న జపాన్ ప్రధాని తకాయిచి కాస్త ట్రంప్ తీరుతో స్టన్ అయ్యారు.
1941, డిసెంబర్ 7వ తేదీన అమెరికా మిలిటరీ బేస్ హవాయిలోని పెరల్ హార్బర్‌పై జపాన్ ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా నౌకా దళాన్ని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో పెరల్ హార్బర్‌పై జపాన్ దాడి చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా దూకుడును అడ్డుకునేందుకు జపాన్ ఆ పనిచేసింది. ఆ అటాక్‌లో సుమారు 2400 మంది అమెరికన్లు మృతిచెందారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 8 దశాబ్ధాలు అవుతోంది. కానీ పెరల్ హార్బర్ ఘటన జపాన్ మిత్రదేశాలకు ఇంకా అర్థంకాని అంశమే.


