ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం వందేమాతరం పాడాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆ సర్క్యులర్ కేవలం సలహా పూర్వకమైనదే తప్ప తప్పనిసరి కాదని స్పష్టంచేసింది.
ప్రభుత్వ ఉత్తర్వులలో ఎలాంటి శిక్షార్హమైన చర్యలు పేర్కొనందున ఈ పిటిషన్‌పై విచారణ తొందరపాటు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ ఏడాది జనవరి 28న కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ కేవలం సలహా మాత్రమేనని, దాన్ని పాటించకపోతే శిక్షలు ఉంటాయని ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం పేర్కొన్నది. ఒకవేళ శిక్షార్హమైన చర్యలు తీసుకుంటే లేదా దాన్ని తప్పనిసరి చేస్తే అప్పుడు విచారిస్తామని, ప్రస్తుతానికి దానిలో అలాంటివేమీ లేవని కోర్టు వ్యాఖ్యానించింది.


