హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, భారత్ కు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ కు హార్ముజ్ తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా దాడులు చేయడంతో ఇరాన్, హార్ముజ్ ను మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో హార్ముజ్ ను ఓపెన్ చేయాలంటూ అమెరికా హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. అయితే, హార్ముజ్ ను పూర్తిగా మూసివేయకుండా తమ మిత్ర దేశాలకు మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ తెలిపింది.
తాజాగా దీనిపై స్పందించిన ఇరాన్ పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో భారత్‌తో సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలపై దిగ్బంధనం విధించబోమని ప్రకటించింది. భారత్‌తో పాటు, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్‌లకు చెందిన నౌకలను హార్ముజ్ గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పింది.


