రికార్డు స్థాయిలో మూడోసారి పొట్టి ప్రపంచకప్‌తో చరిత్ర సృష్టించిన భారత జట్టు ఐపీఎల్ తర్వాత బిజీగా ఉండనుంది. టీమిండియా 2026-27 సీజన్‌లో తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ తలపడనుందని గురువారం బీసీసీఐ తెలిపింది. ఇవి మొత్తం 22 మ్యాచ్‌లు ఉండగా, వీటిలో రెండింటికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికవ్వనుంది. బెంగళూరు, గువాహటి, అహ్మదాబాద్, రాంచీలోనూ భారత జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది.
స్వదేశంలో అదిరే ఆటతో పొట్టి వరల్డ్‌కప్‌ను ముద్దాడిన టీమిండియా వచ్చే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈ ఏడాది కీలక మ్యాచ్‌లు ఆడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ముఖ్యమైన ద్వైపాక్షిక సిరీస్‌లతో శుభ్‌మన్ గిల్ సేన ముందంజ వేయాలనే కసితో ఉంది. 2026-27 సీజన్ విషయానికొస్తే, సొంతగడ్డపై 22 మ్యాచ్‌లతో ప్రేక్షకులను అలరించనుంది. మూడు ఫార్మాట్ల పరంగా చూస్తే 5 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఉన్నాయంతే. గత కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు దూరమైన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రెండు గేమ్స్ జరుగనున్నాయి.


