భారతదేశం రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకొనే దిశగా కీలక ముందడుగు పడింది. ఆధునిక పరిస్థితులకు తగ్గట్టుగా సైనిక అవసరాల కోసం భారీగా యుద్ధ విమానాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ( డీఏసీ) ఆమోదం తెలిపింది. రూ.2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాలను కొనేందుకు రక్షణ శాఖకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆధునిక కాలానికి తగ్గట్టుగా భారత దేశ సైనిక శక్తిని, తెగువను దుర్భేద్యంగా మార్చుకునే దిశగా మరో అడుగు పడింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ శుక్రవారం రూ.2.38 లక్షల కోట్ల యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త విమానాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదన (యాక్సెప్టన్స్ ఆఫ్ నెస్సెసిటీ)కు డీఏసీ అంగీకరించింది. దాంతో, సైన్యం, వాయుసేన, కోస్ట్ గార్డ్ విభాగానికి అవసరమైన యుద్ధ విమానాలను కొనే ప్రక్రియ వేగవంతం కానుంది. ఈరోజు డీఏసీ సమావేశానికి అధ్యక్షత వహించాను. ఈ సందర్భంగా సైన్యం అవసరాల నిమిత్తం రూ.2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాల కొనుగోలుకు అమోదం లభించింది. డీఏసీలో తీసుకున్న ఈ నిర్ణయం భారత దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయనుంది.


