అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మెట్టు దిగారు. యూఎస్-ఇజ్రాయెల్‌తో యుద్ధ విరమణకు అమెరికా ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్ నిర్దంద్వంగా తిరస్కరించినప్పటికీ హొర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తామంటూ గతంలో ఇచ్చిన డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించారు. గతంలో తాను ఇచ్చిన 48 గంటల డెడ్‌లైన్‌ను ఉపసంహరించి ఇరాన్‌కు మరో ఐదు రోజులు గడువిస్తున్నట్టు ఈ నెల 23న ట్రంప్ ప్రకటించారు. అయితే దానికి స్పందన లేకపోవడంతో మరోసారి తన గడువు పొడిగించారు. ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేస్తామని ఏప్రిల్ 6వ తేదీ 8 పీఎం వరకు దానికి డెడ్‌లైన్ విధిస్తున్నట్టు ప్రకటించారు.


