స్పెయిన్ తరహాలోనే ఇటలీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌పై దాడులకు అమెరికా యుద్ధ విమానాలకు తమ దేశ గగనతలం నుంచి అనుమతి లేదని పేర్కొంది. ఈ మేరకు ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ప్రకటన విడుదల చేశారు. సిసిలీలోని నేవల్ ఎయిర్ స్టేషన్ సిగోనెల్లా వంటి స్థావరాల వినియోగం, దీర్ఘకాలంగా అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల పరిధిలోని లాజిస్టికల్, సాంకేతిక మద్దతుకు మాత్రమే పరిమితమై ఉంటుందని ఇటలీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటలీ ప్రధానమంత్రి మెలోని మాట్లాడుతూ ఇరాన్ పై దాడులకు కోసం ఇటలీ గడ్డను వినియోగించుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. అయితే అటువంటి అనుమతి కోసం ఎవరూ అభ్యర్థించలేదని పేర్కొన్నాన్నారు. తాము పశ్చిమాసియా యుద్ధంలో భాగస్వామిగా ఉండము, ఇరాన్‌పై దాడులకు తాము వ్యతిరేకమన్నారు.


