భారత్‌పై నిరంతరం కుట్రలకు తెరతీసే పాకిస్తాన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. కేరళలో జరిగిన సైనిక్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఇండియా కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని, ఇండియాపై పాకిస్తాన్ ఎలాంటి కుట్రలకు తెరతీసినా, భారత్ నిర్ణయాత్మక చర్యలకు దిగుతుందన్నారు.
ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదన్నారు. యూరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్, పుల్వామా దాడి తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్, ఇలా పాక్ దాడిచేసిన ప్రతిసారి గట్టి సమాధానం ఇచ్చాం అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.


